Mahabharatam: ‘మహాభారతం’ చేస్తే ఒక ఎపిసోడ్ కాదు..ఫుల్ ప్లెడ్జ్ డ్ గానే చేయాలి: దర్శకుడు రాజమౌళి

  • ‘మత్తు వదలరా’ నటులతో రాజమౌళి ముచ్చట్లు
  • ‘మహాభారతం’ను సినిమాగా తీస్తాను
  • నటుడు సత్య అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందన

ఇటీవల విడుదలైన ‘మత్తు వదలరా’ నటులు సింహా, సత్య, అగస్త్యలతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సరదాగా ముచ్చటించారు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు, వారికి నచ్చిన షాట్స్, వారి జీవితంలో చోటుచేసుకున్న సరదా సంఘటనలను అడిగి రాజమౌళి తెలుసుకున్నారు. అదే సమయంలో, రాజమౌళిపై కూడా వారు కొన్ని ప్రశ్నలు వేశారు. అందులో ఒక ఆసక్తికరమైన ప్రశ్నను నటుడు సత్య అడిగాడు.ఇతిహాసం, పంచమవేదం అయిన మహాభారతంలో కనీసం ఒక్క ఎపిసోడ్ అయినా మీరు సినిమాగా తీస్తారన్న వదంతులు వినపడుతున్నాయి? అన్న ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ.. ‘మహాభారతం చేస్తే ఒక ఎపిసోడ్ ఎందుకు చేస్తాం.. ఫుల్ ప్లెడ్జ్ డ్ గానే చేయాలి. చాలాసార్లు చెప్పాను. మ్యాగ్జిమ్ ఇంట్రస్ట్ అని.. చేస్తాను’ అని అన్నారు.

Mahabharatam
director
Rajamouli
Mattuvadalra
  • Loading...

More Telugu News