TTD: టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని ఉపసంహరించుకోవాలి: సుబ్రహ్మణ్యస్వామి

  • తిరుపతిలో దేవాలయాల పరిరక్షణ కార్యక్రమం
  • హాజరైన సుబ్రహ్మణ్యస్వామి
  • టీటీడీ ఆడిట్ ను కాగ్ కు అప్పగించాలని డిమాండ్

టీటీడీకి గత వందేళ్లుగా వస్తున్న కానుకలపై ప్రభుత్వంలో ఉన్న అధికారులతో ఆడిట్ చేయిస్తున్నారని, అంతా సవ్యంగానే ఉందని వారే ఎలా ధ్రువీకరిస్తారని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పెత్తనం చేస్తుందని ప్రశ్నించారు. టీటీడీకి గత ఐదేళ్లుగా వచ్చిన కానుకలు, నగదుపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, టీటీడీ ఆడిట్ బాధ్యతలను కాగ్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన దేవాలయాల పరిరక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

TTD
Tirupati
Subramanian Swamy
BJP
Andhra Pradesh
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News