Andhra Pradesh: రాజధాని ఆందోళనలపై చర్చించాలని పవన్ కల్యాణ్ నిర్ణయం

  • అమరావతిలో ఆందోళనలు, నిరసనలు
  • రేపు మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం
  • నేతల అభిప్రాయాలు తెలుసుకోనున్న పవన్

గత కొన్నిరోజులుగా అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రేపు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమైన విభాగాల నాయకులతో పవన్ భేటీ కానున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులు, మూడు రాజధానుల అంశంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు, పార్టీ విధానంపై చర్చించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా, పార్టీపరమైన కార్యక్రమాల షెడ్యూల్ పైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటారు. రాజధాని గ్రామాల్లో జనసేన నేతల పర్యటన నివేదికను కూడా పరిశీలిస్తారు.

Andhra Pradesh
Amaravathi
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News