Andhra Pradesh: ఏపీ రాజధాని రగడపై అశోక్ గజపతిరాజు సెటైర్ల వర్షం

  • ఏపీలో రగులుతున్న రాజధాని అంశం
  • స్పందించిన అశోక్ గజపతిరాజు
  • విజయనగరంలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ వ్యంగ్యం

ఏపీ రాజధానిపై రగిలిన జ్వాలలు మండుతూనే ఉన్నాయి! ఏపీకి మూడు రాజధానులు అని, ఏపీ రాజధాని విశాఖ తరలిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఏపీకి 12 రాజధానులు ఏర్పాటు చేయాలని, నెలకో రాజధాని చొప్పున ఏర్పాటు చేయాలని సెటైర్ వేశారు. అప్పుడు కూడా కొందరు ఫిబ్రవరి నెలలో తక్కువ రోజులు ఉంటాయని గొడవ చేసే అవకాశాలున్నాయని అన్నారు.

అంతేకాదు, తమ స్వస్థలం విజయనగరం అత్యంత ప్రశాంతమైన నగరం అని, అక్కడ కూడా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. విజయనగరంకి ఏం తక్కువైంది? ప్రతి ఒక్కరూ తమ ఊళ్లోనే రాజధాని రావాలనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు.

Andhra Pradesh
Amaravathi
Ashok Gajapathi Raju
Telugudesam
YSRCP
Jagan
  • Loading...

More Telugu News