Amaravathi: రాజధాని రైతులను విడుదల చేయాలంటూ పీఎస్ ఎదుట నిరసన

  • టీడీపీ ఆధ్వర్యంలో తెనాలి పీఎస్ ఎదుట అఖిలపక్షం  ధర్నా
  • రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్
  • విడుదల చేసే వరకు కదిలే ప్రసక్తి లేదంటున్న నేతలు

ఏడుగురు రాజధాని రైతులను అరెస్టు చేసి తెనాలి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన ఘటనపై టీడీపీ సహా, అఖిలపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ అరెస్టులను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులు స్పష్టంగా చెప్పకపోవడాన్ని ప్రశ్నించారు. అరెస్టు చేసిన రైతులను విడుదల చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.

కాగా, రాజధాని రైతులు నాయక్, వెంకటస్వామి, శివబాబు, నరేశ్, సురేంద్ర, శ్రీనివాసరావు, నాగరాజులను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News