Rahul Gandhi: రాహుల్, ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్రవ్యాఖ్యలు

  • రాహుల్ ది ఫాసిస్ట్ ఫ్యామిలీ
  • పోలీసులపైన ప్రియాంక గాంధీనే దాడి చేసింది
  • ఆమెపై కేసు పెట్టాలి

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ది ఫాసిస్ట్ ఫ్యామిలీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న యూపీలో పోలీసులపైన ప్రియాంక గాంధీనే దాడి చేసిందని, ఆమెపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి ఆయన ప్రస్తావిస్తూ, మతపరమైన ఇబ్బందుల కారణంగా పాకిస్థాన్ నుంచి వచ్చిన 30 వేల మంది హిందువుల కోసమే సీఏఏచట్టం తీసుకొచ్చామని చెప్పారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఏ ముస్లిం మతపరమైన ఇబ్బందులతో ఇక్కడికి రాలేదని అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురించి కూడా ఆయన ప్రస్తావించారు. టీటీడీపై మతపరమైన ఆరోపణలు చేస్తున్న వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ పాలకమండలి స్వతంత్రంగా వ్యవహరిస్తోందని అన్నారు. అక్కడ అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే స్పందిస్తానని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Rahul Gandhi
priyanka Gadndhi
subramanay swamy
  • Loading...

More Telugu News