Khammam District: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురి దుర్మరణం

  • ఎనిమిది మందికి తీవ్రగాయాలు 
  • అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో దుర్ఘటన 
  • ప్రమాద సమయానికి ట్రాక్టర్ లో 25 మంది

దాదాపు 25 మంది కూలీలను తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం పత్తి ఏరే పనుల కోసం యజమాని ఏర్పాటు చేసిన ట్రాక్టర్ తొట్టెలో కూర్చుని కూలీలు ప్రయాణిస్తున్నారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉంది. దీంతో పెద్ద గోతిలోకి ట్రాక్టర్ దిగబడినప్పుడు అదుపుతప్పిన తొట్టె బోల్తా కొట్టింది. దీంతో తొట్టెలో ఉన్నవారు తుళ్లి రోడ్డు పై పడిపోయారు. వీరిలో ముగ్గురు చనిపోగా మిగిలిన వారికి గాయాలయ్యాయి.

Khammam District
kusumanchi
Road Accident
three died
  • Loading...

More Telugu News