Hindi Bigboss: బిగ్ బాస్ హౌస్ లో సల్మాన్ ఖాన్ : వంట గది శుభ్రం చేసిన కండల వీరుడు

  • నిర్వహణ పట్టించుకోని కంటెస్టెంట్స్
  • తనే రంగంలోకి దిగిన ఖాన్ 
  • విషయం తెలిసి క్షమాపణ కోరిన హౌస్ మేట్స్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు. కంటెస్టెంట్స్ అంతా పడక గదుల్లో నిద్రపోతుండగా చడీచప్పుడు కాకుండా హౌస్ లోకి ప్రవేశించిన సల్మాన్ అక్కడి వంట గది, బాత్ రూంల నిర్వహణ సరిగా లేకపోవడం గుర్తించారు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హిందీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13 వ్యాఖ్యాతగా సల్మాన్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. హౌస్ లోని కంటెస్టెంట్స్ తామున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం లేదని సల్మాన్‌ గుర్తించారు. దీంతో అయనే చర్యలు చేపట్టారు. సల్మాన్ హౌస్ లో ఉన్నంత సేపు  కంటెస్టెంట్స్ ఉన్న పడక గదుల తలుపులు మూసుకుపోయాయి.

దీంతో సల్మాన్ వంట గది, బాత్ రూమ్ లు శుభ్రం చేసి హౌస్ బయటకు వచ్చారు. ఆ తర్వాత కంటెస్టెంట్ల గదుల తలుపులు తెరుచుకున్నాయి. బయటకు వచ్చిన వారు సల్మాన్ చేసిన పనిని తెలుసుకుని క్షమాపణ కోరారు. అయితే దాన్ని సల్మాన్ అంగీకరించ లేదు.

Hindi Bigboss
Salman Khan
contestents
washroom cleaning
  • Loading...

More Telugu News