Sujana Chowdary: అమరావతిలో నేను స్థలం కొనలేదు: సుజనా చౌదరి

  • విశాఖ ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులు చెందుతున్నారు
  • పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేయడం అనైతిక చర్య
  • రాష్ట్ర ప్రజలందరి రాజధాని అమరావతి 
  • సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేయాలి  

అమరావతిలో తాను ఎక్కడా గజం స్థలం కూడా కొనలేదని బీజేపీ నేత సుజనా చౌదరి స్పష్టం చేశారు. తుళ్లూరులో దీక్ష చేస్తోన్న రాజధాని రైతులకు ఆయన ఈ రోజు సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులు చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలో 10 రోజుల పాటు విశాఖలో అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేయడం అనైతిక చర్య అని సుజనా చౌదరి విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరి రాజధాని అమరావతి అని ఆయన అన్నారు. ఇక నుంచి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని నినాదాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Sujana Chowdary
BJP
  • Loading...

More Telugu News