Sujana Chowdary: పొరపాటు వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు: సుజనా చౌదరి

  • పరిహారం పొందే హక్కు అమరావతి రైతులకు ఉంది
  • ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భావితరాలు నష్టపోతాయి
  • హక్కులు తెలుసుకున్న రోజే ఇలాంటి నేతలను గద్దె దించొచ్చు
  • అవినీతి చేసిన వారిపై విచారణ జరిపి జైలులో పెట్టవచ్చు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ నేత సుజనా చౌదరి మండిపడ్డారు. తుళ్లూరులో దీక్ష చేస్తోన్న రాజధాని రైతులతో ఆయన ఈ రోజు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పొరపాట్లు జరగడం సహజమని, ఏదో పొరపాటు వల్లే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. సీఆర్డీఏలో అమరావతి ప్రజలు సంతకాలు పెట్టారని, పరిహారం పొందే హక్కు అమరావతి రైతులకు ఉందని చెప్పారు. సుమారు లక్ష కోట్ల రూపాయలు అడిగే హక్కు రైతులకు ఉందని ఆయన చెప్పారు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భావితరాలు నష్టపోతాయని సుజనా చౌదరి అన్నారు. హక్కులు తెలుసుకున్న రోజే ఇలాంటి నేతలను గద్దె దించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతి చేసిన వారిపై విచారణ జరిపి జైలులో పెట్టవచ్చని ఆయన అనడం గమనార్హం. రాష్ట్రానికి భవిష్యత్తులో ఉండే ప్రమాదమేంటో రైతులకు వివరిస్తామని అన్నారు. 

Sujana Chowdary
Telugudesam
YSRCP
BJP
  • Loading...

More Telugu News