Thrissur: వరుడి వయసు 67.. వధువుకి 65 ఏళ్లు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.. ఫొటోలు వైరల్!

- కేరళలోని త్రిస్సూర్ జిల్లా రామవరంపురంలో ఘటన
- వృద్ధా శ్రమంలో ఉంటున్న వృద్ధులు
- వారిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా పరిచయం
వరుడి వయసు 67.. వధువుకి 65 ఏళ్లు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్ జిల్లా రామవరంపురంలో చోటు చేసుకుంది. కొచానియన్ మీనన్ అనే తాతయ్య, పీవీ లక్ష్మీ అమ్మల్ అనే బామ్మ వృద్ధా శ్రమంలో ఉంటున్నారు. వారిద్దరికీ కొన్ని దశాబ్దాలుగా పరిచయం ఉంది.

