Hyderabad: విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

  • ఈ ఉదయం టేకాఫ్ అయిన విమానం
  • సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్లు
  • మళ్లీ వెనక్కు వచ్చి క్షేమంగా ల్యాండ్ అయిన విమానం

ఈ ఉదయం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా, అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులతో పాటు, వైజాగ్ ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ తీవ్ర ఆందోళన చెందారు. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ ఫాల్ట్ ను గుర్తించిన పైలెట్లు, విమానాన్ని వెనక్కు తీసుకుని వస్తున్నామని కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆపై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగలేదని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత తిరిగి విమానం బయలుదేరుతుందని తెలిపారు. కాగా, విమానం ఆలస్యంతో విశాఖ ఎయిర్‌ పోర్టులో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండగా, అదే విమానంలో విశాఖకు వెళ్లాల్సిన హైదరాబాద్ ప్రయాణికుల పరిస్థితి కూడా అంతే.

Hyderabad
Vizag
Indigo
  • Loading...

More Telugu News