Udipi: చివరి కోరికను తీర్చుకుని... మఠానికి తీసుకుని వచ్చిన గంటలోనే శివైక్యమైన విశ్వేశ్వర తీర్థ!

  • ఉడిపి పెజావర మఠాధిపతిగా విశ్వేశ్వర తీర్థ
  • గత కొంతకాలంగా అనారోగ్యం
  • ఈ ఉదయం ఆసుపత్రి నుంచి మఠానికి స్వామి
  • ఉడిపి చేరుకున్న కేంద్ర మంత్రి ఉమాభారతి

కర్ణాటకలోని సుప్రసిద్ధ ఉడిపి, పెజావర మఠాధిపతి విశ్వేశ్వర తీర్ధ స్వామీజీ కొద్దిసేపటి క్రితం శివైక్యమయ్యారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చివరి కోరిక మేరకు ఈ ఉదయమే స్వామీజీని ఆయన శిష్యులు, ఉడిపి శ్రీకృష్ణ మఠానికి తరలించారు. ఆపై కాసేపటికే అశేష భక్తులను దుఃఖ సాగరంలో ముంచుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఉడిపి ఎమ్మెల్యే కే రఘుపతి భట్ కన్నీటితో ప్రకటించారు.

ఈ నెల 20 నుంచి ఆయన ఆరోగ్యం విషమించిందని, తొలుత న్యుమోనియా వచ్చిందని ఆయన అన్నారు. ఆపై ఆరోగ్యం విషమించి, మెదడు పనితీరు మందగించిందని, ఆపై ఆయన స్పృహలోకి రాలేదని, స్వామి చివరి కోరిక మేరకు లైఫ్ సపోర్ట్‌ తోనే ఆదివారం ఉదయం మఠానికి తీసుకుని వచ్చామని అన్నారు. కాగా, స్వామీ మరణం గురించిన సమాచారం తెలియగానే కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి ఉడిపి శ్రీకృష్ణ మఠానికి చేరుకున్నారు. ఆయన అంత్యక్రియలపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Udipi
Pezawar
Vishveshvar Swamy
  • Loading...

More Telugu News