parliament: ఎంపీల కోసం ప్రత్యేక కాల్ సెంటర్.. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు
- కాల్ సెంటర్ కోసం పార్లమెంటు అనుబంధ భవనంలోని 13వ గది
- ముగ్గురు అధికారులు, ప్రత్యేక సిబ్బంది నియామకం
- ఫోన్ చేస్తే సకల సమాచారం
దేశంలోని ఎంపీల కోసం ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటైంది. ఇందుకోసం పార్లమెంటు అనుబంధ భవనంలోని 13వ గదిని కేటాయించి ముగ్గురు అధికారులు, ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఈ కాల్ సెంటర్ ద్వారా పార్లమెంటు సభ్యులు తమకు అవసరమైన సకల సమాచారాన్ని పొందవచ్చు.
ఇందులో ఎంపీల రవాణా బిల్లుల క్లియరెన్స్, అదనపు భత్యాలు, కీలక బిల్లులకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మెటీరియల్, పార్లమెంటు సమావేశాల వివరాలు, గత సమావేశాల చర్చలకు సంబంధించిన వివరాలు, తాము వేసిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని ఫోన్ చేసి పొందవచ్చు. గతనెలలో స్పీకర్ ఓం బిర్లా ప్రయోగాత్మకంగా ఈ కాల్ సెంటర్‌ను ప్రారంభించగా, తాజాగా పూర్తిస్థాయి సమాచార కేంద్రంగా రూపుదిద్దుకుంది.