Jharkhand: నేడు హేమంత్ సోరేన్ ప్రమాణం... హాజరుకానున్న కాంగ్రెస్ దిగ్గజాలు!

  • ఝార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా సోరెన్
  • హాజరుకానున్న ప్రణబ్, రాహుల్, ప్రియాంక
  • కమల్ నాథ్, కేజ్రీవాల్, మమత, ఉద్ధవ్ కూడా

ఝార్ఖండ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, చిదంబరం తదితర నేతలు వస్తారని ఝార్ఖండ్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి సోనియా గాంధీ కూడా కార్యక్రమానికి రావాల్సివుందని, అయితే, ఆమె స్వల్ప అనారోగ్యంతో ఉండటంతో రాలేకపోతున్నారని తెలిపాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కూడా సోరెన్ ప్రమాణానికి హాజరు కానున్నారు. ఝార్ఖండ్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి, జేఎంఎం - కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Jharkhand
Hemant Soren
Pranab Mukherjee
Rahul Gandhi
Priyanka
  • Loading...

More Telugu News