Warangal Urban District: రెండోసారి కిడ్నాప్ కు గురైన వరంగల్ బాలిక... రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని తండ్రికి బెదిరింపులు!

  • గతంలో ఓ మారు కిడ్నాప్
  • కేసు కోర్టులో నడుస్తుండగానే మరోమారు అపహరణ
  • కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు

తన కుమార్తెను కిడ్నాప్ చేసిన కొందరు ఆమెను రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామని బెదిరిస్తున్నారని ఓ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. గతంలో కిడ్నాప్ చేసిన వారే ఈ దఫా కూడా ఈ పని చేసి ఉండవచ్చని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. కిడ్నాపర్లతో, తన కుమార్తెతో మాట్లాడిన ఆడియోను పోలీసులకు అందించగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

కాగా, వరంగల్ జిల్లా, కాజీపేటకు చెందిన ఈ బాలిక రెండోసారి కిడ్నాప్ కు గురికావడం గమనార్హం. గతంలో ఓ మారు కొందరు యువకులు బాలికను కిడ్నాప్ చేయగా, పోలీసులు ఆమెను గుర్తించి విడిపించారు. నిందితులను అరెస్ట్ చేయగా, వారికి బెయిల్ మంజూరైంది. ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే ఆమె మరోసారి కిడ్నాప్ కు గురికావడంతో పోలీసులు సరైన భద్రతా చర్యలు కల్పించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

Warangal Urban District
Kazipet
Kidnap
Minor Girl
Police
  • Loading...

More Telugu News