Koneru Hampi: వరల్డ్ ర్యాపిడ్ చెస్... జగజ్జేతగా నిలిచిన కోనేరు హంపి!

  • కెరీర్ లో తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ లో విజేతగా హంపి
  • ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు
  • మెరుగైన టై బ్రేక్ స్కోరుతో విజయం

భారత నంబర్‌ వన్‌ చెస్‌ క్రీడాకారిణి, గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపి తన కెరీర్‌ లో తొలిసారి ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ షిప్ లో జగజ్జేతగా నిలిచింది. ఈ టోర్నీలో గెలిచిన తొలి భారత క్రీడాకారిణి హంపి కావడం గమనార్హం. మొత్తం 12 రౌండ్ల పాటు పోటీలు జరుగగా, కోనేరు హంపి, లీ టింగ్‌ జి (చైనా), అతాలిక్‌ ఎకతెరీనా (టర్కీ) తొమ్మిదేసి పాయింట్లతో అగ్రస్థానంలో సంయుక్తంగా నిలిచారు. అయితే, మెరుగైన టై బ్రేక్‌ స్కోరు హంపికి లాభించింది. దీంతో ఆమె తొలి స్థానంలో నిలువగా లీ టింగ్‌ జి రెండో స్థానంలో నిలిచింది.

వీరిద్దరి మధ్యా రెండు బ్లిట్జ్‌ గేమ్‌ లు నిర్వహించగా, తొలి గేమ్‌ లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోయింది. రెండో బ్లిట్జ్‌ గేమ్‌ లో నల్లపావులతో ఆడి, 45 ఎత్తుల్లో గెలిచి వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఇక ఇదే పోటీల్లో మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News