Ramcharan: రామ్ చరణ్ అర్ధాంగికి చాలెంజ్ విసిరిన అమల

  • గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన అమల
  • అమలను నామినేట్ చేసిన ఐఏఎస్ అధికారి
  • ముగ్గుర్ని నామినేట్ చేసిన అమల

తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ కు సెలబ్రిటీల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. తాజాగా అక్కినేని అమల కూడా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించిన అమల వెంటనే స్పందించారు. అంతేకాకుండా, మొక్కలు నాటిన అనంతరం టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసనకు చాలెంజ్ విసిరారు. అంతేకాదు, ఈ చాలెంజ్ కోసం వాసంతి, హీరా రూపానిలను కూడా నామినేట్ చేశారు.

Ramcharan
Upasana
Amala
Green India Challenge
Telangana
  • Error fetching data: Network response was not ok

More Telugu News