Telangana minister Talasani Srinivas yadav condemn TPCC Uttam Kumar Reddy: ఉత్తమ్‌ విమర్శలు రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

  • రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం తగదు
  • గతంలో కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతిచ్చారు
  •  ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతించలేదు

తెలంగాణ సీఎం కేసీఆర్, సీపీ అంజనీకుమార్‌పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పందించారు. ఈ రోజు రాత్రి మీడియాతో మాట్లాడుతూ తలసాని.. ఉత్తమ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. సీపీపై ఉత్తమ్‌ విమర్శలు రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

‘నిబద్ధతతో పనిచేసే పోలీస్ అధికారులపై రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం తగదు. గతంలో కాంగ్రెస్‌ సభలు, సమావేశాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదా?. ప్రస్తుత పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతించలేదని పోలీసులను ఇష్టమొచ్చిన మాటలు అనడం సరికాదు’ అని తలసాని అన్నారు.

ఈ రోజు కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహం దీక్ష సందర్భంగా పార్టీ నేతలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉత్తమ్ సీరియస్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతిచ్చిన పోలీసులు, కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఎందుకు నిరాకరించారని ప్రశ్నిస్తూ.. సీపీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Telangana minister Talasani Srinivas yadav condemn TPCC Uttam Kumar Reddy
Uttam commensts on Hyderabad CP
  • Loading...

More Telugu News