China: మార్స్ మిషన్ లో చైనా ముందడుగు... ఏ దేశం వద్ద లేని అత్యంత శక్తిమంతమైన రాకెట్ ప్రయోగం

  • అంగారకుడిపై పరిశోధనలకు చైనా ఆసక్తి
  • లాంగ్ మార్చ్-5 రాకెట్ ప్రయోగం
  • కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించిన చైనా

చైనా పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దృఢ సంకల్పానికి మారుపేరుగా నిలిచే ఈ దేశం రోదసిలో తన ఆధిక్యత నిరూపించుకునేందుకు సుదీర్ఘ ప్రణాళికలు రచిస్తోంది. కొంతకాలంగా అంగారకుడిపై పరిశోధనలను లక్ష్యంగా చేసుకున్న చైనా ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మరే ఇతర దేశం వద్ద లేనంత శక్తిమంతమైన లాంగ్ మార్చ్-5 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.

 చైనాకు చెందిన హైనాన్ ద్వీపం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ఓ టెస్ట్ శాటిలైట్ ను మోసుకెళ్లడమే కాదు, విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, మార్స్ మిషన్ లో భాగంగా ప్రయోగించిన లాంగ్ మార్చ్-5 రాకెట్ కు ఫ్యాట్ ఫైవ్ అని మారుపేరు కూడా ఉంది. ఓ కీలకమైన టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికే చైనా ఈ ప్రయోగం చేపట్టినట్టు అధికారిక మీడియా వెల్లడించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News