Andhra Pradesh: విశాఖలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

  • విశాఖలో సీఎం పర్యటన
  • విశాఖ ఉత్సవ్ లో పాల్గొననున్న సీఎం
  • వైఎస్ విగ్రహానికి నివాళులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నంలో కైలాసగిరి, సెంట్రల్ పార్కులో పలు అభివృద్థి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మధ్యాహ్నం విశాఖ వెళ్లిన ఆయన నగరంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1285.32 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

జీవీఎంసీలో రూ.905.50 కోట్ల అభివృద్ధి పనులకు, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూ.379.82 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కైలాసగిరిపై రూ.37 కోట్లతో ప్లానెటోరియం పనులను ప్రారంభించారు. అంతకుముందు సెంట్రల్ పార్కులోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆయన విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలోనూ పాల్గొంటారు.

Andhra Pradesh
Vizag
Jagan
YSRCP
Visakha Utsav
  • Loading...

More Telugu News