Pubji game: పబ్జి గేమ్ పేరుతో అమ్మాయికి వల వేసిన యువకుడు... అరెస్టు చేసిన పోలీసులు

  • వాట్సాప్ ద్వారా వ్యక్తిగత వివరాలు, వీడియోలు తీసుకున్న యువకుడు
  • ప్రేమిస్తున్నానంటూ.. తనతో గడపాలని బ్లాక్ మెయిల్
  • వ్యూహం ప్రకారం నిందితుడిని అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

పబ్జి గేమ్ లో చాటింగ్ చేస్తూ అమ్మాయితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు అనంతరం ప్రేమ పేరిట లోబర్చుకోవాలని చూశాడు.. కాని వ్యూహం వికటించి.. పోలీసులకు చిక్కాడు. ఆ వివరాల్లోకి వెళితే, నాంపల్లికి చెందిన సల్మాన్ అనే యువకుడు పబ్జీ గేమ్ లో ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. అనంతరం వాట్సాప్ నెంబర్ ద్వారా చాట్ చేసి అమ్మాయి వివరాలు తెలుసుకున్నాడు. ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నానని చెబుతూ.. తనతో గడపాలని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపటంతో.. వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వ్యూహం ప్రకారం సల్మాన్ ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారు. సల్మాన్ మొబైల్ డేటా ఆధారంగా ఇంకా ఎంతమంది అమ్మాయిలను మోసం చేశాడో కూపీ లాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Pubji game
A Young Person gathered A girl personal details Photoes videos
Black Mailed her to spend time with him
Police Arrested
  • Loading...

More Telugu News