CPI Narayana: బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది: సీపీఐ నారాయణ
- రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లులు ప్రవేశపెడుతోంది
- ఉగ్రవాదం పేరుతో ఒక మతాన్ని టార్గెట్ చేయడం తగదు
- నిర్మలా సీతారామన్ చాలా కమ్మగా అబద్ధాలు చెబుతున్నారు
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లులు ప్రవేశపెడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆర్థిక నేరగాళ్లకు కొమ్ము కాసేందుకు కొత్త చట్టాలు తెస్తున్నారని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా కమ్మగా అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదాన్ని తాము ఎప్పటికీ వ్యతిరేకిస్తామన్నారు. అయితే, ఉగ్రవాదం పేరుతో ఒక మతాన్ని టార్గెట్ చేయడం సరికాదని చెప్పారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా మోదీ, అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.