Andhra Pradesh: జీఎన్ రావు ఏమైనా పోటుగాడా? ఆయన గురించి అందరికీ తెలుసు: సీపీఐ నారాయణ

  • రాజధాని అంశంపై నారాయణ వ్యాఖ్యలు
  • ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందంటూ విమర్శ
  • బీజేపీ ఓటమి తర్వాత జగన్ యూటర్న్ తీసుకున్నారని వెల్లడి

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ రాజధాని అంశంలో తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవడంతో జగన్ యూటర్న్ తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రస్తుతం విధ్వంసకర పాలన సాగుతోందని, మూడు రాజధానులంటూ కొత్త వివాదం సృష్టించారని విమర్శించారు. జీఎన్ రావు ఏమైనా పోటుగాడా? ఆయన గురించి అందరికీ తెలుసు అంటూ నారాయణ విరుచుకుపడ్డారు. రాజధాని కమిటీలు కాలయాపనకే తప్ప, ఆ కమిటీలు ఇచ్చే నివేదికలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని అన్నారు. ఆ కమిటీల నివేదికలు జగన్ చెప్పినట్టే ఉంటాయని ఎద్దేవా చేశారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు నిరూపించలేకపోయారంటూ ఏపీ మంత్రివర్గాన్ని నిలదీశారు. విశాఖ భూ కుంభకోణంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆరోపించారు. గంటా, ధర్మాన కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందని అన్నారు.

Andhra Pradesh
Amaravathi
CPI Narayana
YSRCP
Jagan
Vizag
GN Rao
  • Loading...

More Telugu News