Avanthi Sriniva: అమరావతిపై డబ్బులు పెట్టి చంద్రబాబు ఉద్యమం నడిపిస్తున్నారు: మంత్రి అవంతి శ్రీనివాస్

  • చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మోసం చేశారు
  • మళ్లీ ప్రతిపక్ష నేత హోదాలో అదే పని చేయాలనుకుంటున్నారు
  •  అభివృద్ధి చేయలేదనే అమరావతి ప్రజలు ఆయనను తిరస్కరించారు

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి ప్రజలను మోసం చేశారని.. తాజాగా ప్రతిపక్ష నేత హోదాలో మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. అభివృద్ధి చేయలేదనే అమరావతి ప్రజలు ఆయనను తిరస్కరించారని పేర్కొన్నారు. చంద్రబాబు డబ్బులు పెట్టి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు మాదిరిగా ప్రజలకు ఆశలు చూపడం, ఊహలు కల్పించడం జగన్ కు సాధ్యం కాదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చ జరుపుతామంటూ.. ఈ ప్రక్రియ అంతా పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని అడ్డుకోవడం దారుణమన్నారు.

Avanthi Sriniva
criticism against Chandhrababu naidu
At Amaravathi pumping money to provoke people
  • Loading...

More Telugu News