Vijay Sai Reddy: విశాఖను అడ్డుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు: విజయసాయిరెడ్డి

  • అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
  • న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు
  • ఆ పార్టీ నేతలు అమరావతి ప్రాంతంలో భారీగా భూములు కొన్నారు

విశాఖపట్టణంను పరిపాలనా రాజధానిగా చేయడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, దీన్ని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. న్యాయవ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారన్నారు. అమరావతి ప్రాంత రైతులను రెచ్చగొడుతూ.. విశాఖను పరిపాలన కేంద్రం చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ఉత్తరాంధ్రకు ద్రోహం చేయాలనే తలంపు టీడీపీ నేతల ఆలోచనల్లో కనిపిస్తోందన్నారు.  ‘టీడీపీ నేతలంతా అమరావతి చుట్టుపక్కల కొన్ని వేల ఎకరాల భూములు కొన్నారు. ఆ భూముల ద్వారా వచ్చే లాభాలను విదేశాలకు తరలించాలన్న తలంపు వారిది. విశాఖ పరిపాలనకు అనుకూలంగా ఉందనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.

Vijay Sai Reddy
comments on Chandrababu
visakha admn.capital
  • Loading...

More Telugu News