Asaduddin Owaisi: సమగ్ర కుటుంబ సర్వే సమయంలో లేని అభ్యంతరం ఇప్పుడెందుకొచ్చింది?: ఒవైసీపై ఎంపీ అరవింద్ విసుర్లు

  • నిన్న నిజామాబాద్ లో ఎంఐఎం సభ
  • ఓట్ల కోసమే సభ నిర్వహించారంటూ అరవింద్ ఆరోపణ
  • కేసీఆర్ ముస్లింలకే ముఖ్యమంత్రి అంటూ విమర్శలు

నిజామాబాద్ లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించడం పట్ల ఎంపీ అరవింద్ స్పందించారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సమయంలో అసదుద్దీన్ ఒవైసీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడలేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నార్సీ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని స్పష్టం చేశారు. ఓట్ల కోసమే నిజామాబాద్ లో సభ నిర్వహించారని అరవింద్ ఆరోపించారు. మత ప్రాతిపదికనే ఒవైసీ సభకు అనుమతి ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ కేవలం ముస్లింలకు మాత్రమే సీఎంలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi
MIM
Nizamabad
Aravind
BJP
KCR
Telangana
TRS
  • Loading...

More Telugu News