Keerthy Suresh: 'మహానటి' సినిమా వద్దనుకున్నా... ఆయనే ఒప్పించారు: కీర్తి సురేశ్

  • నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు ఆ పాత్రను చేయలేననిపించింది
  • మా మామయ్య గోవింద్ నన్ను ఒప్పించారు
  • నా మీద నమ్మకం ఉంచిన నాగ్ అశ్విన్ కు థ్యాంక్స్

గ్లామర్, స్టైలిష్ పాత్రలతో మెప్పించిన కీర్తి సురేశ్... 'మహానటి' చిత్రంతో ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన ఆమె... ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

మొదట్లో 'మహానటి' సినిమాను వద్దనుకున్నానని కీర్తి సురేశ్ తెలిపింది. అయితే, తన మామయ్య గోవింద్ తనను ఒప్పించారని చెప్పింది. సావిత్రి పాత్రను తాను బాగా పోషించగలననే నమ్మకం మామయ్యకు ఉందని తెలిపింది. నాగ్ అశ్విన్ తనకు 'మహానటి' కథను చెప్పినప్పుడు అంత గొప్ప పాత్రను తాను పోషించలేననిపించిందని చెప్పింది. కానీ, ఆయన మాత్రం సావిత్రి పాత్రలో తనను తప్ప వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నానని అన్నారని తెలిపింది. చివరకు ఈ చిత్రంలో నటించానని... తన మీద నమ్మకం ఉంచిన నాగ్ అశ్విన్ కు ధన్యవాదాలు చెబుతున్నానని అంది.

Keerthy Suresh
Mahanati Movie
Tollywood
  • Loading...

More Telugu News