Srinu Vaitla: కొత్త కథను సిద్ధం చేశాను: దర్శకుడు శ్రీను వైట్ల

  • ఎన్నో హిట్లు ఇచ్చిన శ్రీను వైట్ల 
  • వరుసగా వెంటాడిన పరాజయాలు 
  • త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు  

శ్రీను వైట్ల .. ఒకప్పుడు వరుస విజయాలను అందుకున్న దర్శకుడు. స్టార్ హీరోల ఖాతాలో చెప్పుకోదగిన చిత్రాలను నమోదు చేసిన దర్శకుడు. కథ ఏదైనా కామెడీ ప్రధానంగా నడిపించడంలో ఆయనకి ఆయనే సాటి. కామెడీ ఎపిసోడ్స్ ను డిజైన్ చేయడంలో ఆయన తరువాతనే ఎవరైనా అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. అలాంటి శ్రీను వైట్ల కొంతకాలంగా వరుస పరాజయాలతో వెనకబడ్డాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ ..'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా పరాజయం నిరాశ పరిచిన మాట వాస్తవమే. ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందనే విషయాన్ని ఈ సినిమా నాకు స్పష్టం చేసింది. ప్రేక్షకులు ఏ స్థాయిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారనేది నాకు అర్థమైంది. అందువల్లనే కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథను సిద్ధం చేసుకున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ అల్లబడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా ఎవరితో ఉంటుంది? .. ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రకటన త్వరలో ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.

Srinu Vaitla
  • Loading...

More Telugu News