IYR Krishna Rao: ఇలా చేస్తే విశాఖను ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు: ఐవైఆర్ కృష్ణారావు

  • అమరావతి కోసం లక్ష కోట్లు పెట్టడం సాధ్యం కాదు
  • విశాఖలో వెయ్యి కోట్లతో రాజధానికి కావాల్సిన భవనాలు నిర్మించుకోవాలి
  • మరో రూ. 10 వేల కోట్లను ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాలి

అమరావతి కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేయగలమా అనేదే రాజధాని చర్చలో ప్రధాన అంశమని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. 33 వేల ఎకరాల్లో ప్రభుత్వం చేతికి వచ్చే 10 వేల ఎకరాలకు విలువ రావాలన్నా ముందుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం సాధ్యమయ్యే విషయం కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఇదే సమయంలో రాజధాని విశాఖ అంశాన్ని సమర్థిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. రూ. 1000 కోట్లతో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించుకుని... మరో రూ. 10 వేల కోట్లను ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు పెడితే, ఆ నగరాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

IYR Krishna Rao
Amaravathi
Vizag
  • Loading...

More Telugu News