Narendra Modi: నా పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదు.. మేం వాటికే తప్ప హిందువులకు వ్యతిరేకం కాదు: అసదుద్దీన్ ఒవైసీ

  • తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు
  • ఈ దేశాన్ని మూడు ముక్కలు చేయాలని మోదీ చూస్తున్నారు
  • నిజామాబాద్ బహిరంగ సభలో అసద్

ఎన్ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు మాత్రమే తాము వ్యతిరేకమని, హిందువులకు కాదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మూడింటికి వ్యతిరేకంగా నిజామాబాద్‌లో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీపై నిప్పులు చెరిగారు.

భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోదీ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదని అసద్ పేర్కొన్నారు. తాను హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Narendra Modi
Asaduddin Owaisi
NRC
CAA
  • Loading...

More Telugu News