union minister prakash Javadeker: ఎన్పీఆర్ పై రాహుల్ అబద్ధాలు మాట్లాడుతున్నారు: కేంద్రమంత్రి జవదేకర్

  • 2010లో కాంగ్రెస్ ఎన్పీఆర్ ను చేపట్టింది
  • కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధిపొందాలని భావిస్తోంది
  • 2019 సంవత్సరపు అతిపెద్ద అబద్ధాల కోరు రాహుల్

జాతీయ జనాభా జాబితా(ఎన్పీఆర్) పేదలపై పన్ను విధింపు లాంటిదన్న రాహుల్ వ్యాఖ్యలపై   కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్  మండిపడ్డారు. ఇది పేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలందరూ దీనిని ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ భిన్న వైఖరిని అవలంబిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధిపొందాలని భావిస్తోందని ఆరోపించారు. అందుకే ఎన్పీఆర్ ను వ్యతిరేకిస్తోందన్నారు.  

2010 లో కాంగ్రెస్ దీన్ని చేపట్టిందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఉన్న సమయంలో అబద్ధాలాడినప్పటికీ నడిచిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా లేకపోయినా ఆ అబద్ధాలనే కొనసాగిస్తున్నారని  జవదేకర్ ఎద్దేవా చేశారు. రాహుల్ మాటలు ఆయన కుటుంబాన్నే ఇబ్బందిపెట్టేవని, ఇప్పుడు దేశాన్ని కూడా ఇబ్బందులు పెట్టేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. 2019 సంవత్సరపు అతిపెద్ద అబద్ధాల కోరు రాహుల్ గాంధీ  అని  జవదేకర్ వ్యాఖ్యానించారు.

union minister prakash Javadeker
comments on Rahul gandhi
2019 biggest liar Rahul
  • Loading...

More Telugu News