Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ ను కలవడం ఆనందంగా ఉంది: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు

  • విజయవాడ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి
  • సీఎం జగన్ తో భేటీ
  • మోదీ విజన్ ను ముందుకు తీసుకెళ్లాని జగన్ ను కోరిన సురేశ్ ప్రభు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ పార్లమెంటు సభ్యుడు సురేశ్ ప్రభు ఈ సాయంత్రం విజయవాడలో ఏపీ సీఎం జగన్ దంపతులను కలిశారు. సతీసమేతంగా ఏపీకి వచ్చిన ఆయనకు జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఇక జగన్ తో భేటీ వివరాలను ఆయన ట్వీట్ చేశారు. సీఎం జగన్ ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలకు కనీసం ఒక్క నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్నయినా ఏర్పాటు చేసే విషయంపై చర్చించామని, తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ ను ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పాటు అందించాలని చర్చించామని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు ద్వారా యువత, మహిళలు, రైతులు, మత్స్యకారులు ఎంతో లాభపడతారని సురేశ్ ప్రభు వివరించారు.

Andhra Pradesh
Jagan
YSRCP
Suresh Prabhu
Narendra Modi
BJP
  • Loading...

More Telugu News