Telangana: పోలీసులు ఎంఐఎం పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు: రాజాసింగ్ ఆరోపణ

  • నిజామాబాద్ లో ఎంఐఎం సభ
  • బీజేపీ సభకు అనుమతి ఇవ్వలేదని రాజాసింగ్ ఆగ్రహం
  • ఈ నెల 30న సభ నిర్వహిస్తామని వెల్లడి

ఎంఐఎం పార్టీకి తెలంగాణ పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. ఎంఐఎం పార్టీ ఎక్కడ సభ నిర్వహించుకునేందుకైనా అనుమతి ఇస్తున్న పోలీసులు తమకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. సీఏఏకు అనుకూలంగా రేపు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దాంతో ఈ నెల 30న ఇందిరాపార్క్ వద్ద సభ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. బీజేపీకి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వడంలేదని మండిపడ్డారు. ఎంఐఎం నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

Telangana
BJP
Rajasingh
MIM
Asaduddin Owaisi
Police
Nizamabad District
  • Loading...

More Telugu News