Chandrababu: చంద్రబాబుకు డెబ్బై.. మీకు యాభై ఏళ్లు కూడా రాలేదుగా?: జగన్ పై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

  • రాజధానిగా అమరావతినే కొనసాగించాలి
  • సెక్రటేరియట్, అసెంబ్లీలది భార్యాభర్తల సంబంధం లాంటిది
  • పెళ్లాం ఒకచోట, మొగుడు ఒకచోట కాపురం చేస్తారా?

చంద్రబాబుకు డెబ్బై ఏళ్లు అని, జగన్ కు ఇంకా యాభై ఏళ్లు కూడా రాలేదని.. ఇంకా కొన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఉండదలచుకున్న ఆయన రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని సీపీఐ నారాయణ హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో రైతులను కలిసిన అనంతరం ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

'సెక్రటేరియట్, అసెంబ్లీలది భార్యాభర్తల సంబంధం లాంటింది, ‘మరి, పెళ్లాం ఒకచోట, మొగుడు ఒకచోట కాపురం చేస్తారా?’ సెక్రటేరియట్ ఒకవైపు, అసెంబ్లీ మరోవైపు ఉంటుందా?' అని ప్రశ్నించారు. మూడు ప్రాంతాలను సమన్వయపరచాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి, ఆయా ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజధాని తరలిపోకుండా చేసే పోరాటానికి తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

Chandrababu
Jagan
CPI Narayana
Amaravathi
  • Loading...

More Telugu News