Visakhapatnam: రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన

  • మధ్యాహ్నం గన్నవరం నుంచి బయలుదేరనున్న సీఎం
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • ‘విశాఖ ఉత్సవ్’ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న జగన్

రేపు విశాఖపట్టణంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు.
విశాఖలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కైలాసగిరిలో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగే, వైఎస్సార్ సెంట్రల్ పార్క్ వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్కే బీచ్ లో సాయంత్రం ‘విశాఖ ఉత్సవ్’ ప్రారంభిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు అక్కడి నుంచి తిరిగి విజయవాడ బయలుదేరతారు. 

Visakhapatnam
cm
Jagan
Visakha Utsav
  • Loading...

More Telugu News