Andhra Pradesh: ఏపీ రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

  • విశాఖలో 'బ్యూటిఫుల్' మూవీ ప్రమోషన్ ఈవెంట్
  • రాజధాని అంశంపై స్పందించిన వర్మ
  • రాజధాని ఎక్కడుంటే ఏంటి? అంటూ వ్యాఖ్యలు

ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజధానిపై స్పందించారు. రాజధాని ఎక్కడుంటే ఏంటి? అని ప్రశ్నించారు. రాజకీయాలతో సంబంధంలేని సామాన్యులకు రాజధాని ఎక్కడున్నా ఒకటేనని అన్నారు. తనవరకు రాజధాని పక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసినా పట్టించుకోనని స్పష్టం చేశారు. రాజధాని అనకాపల్లిలో ఉంటే ఏంటి? చెన్నైలో ఉంటే ఏంటి? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన వర్మ, ప్రజలకు నేరుగా పాలన అందించడం కోసమే రాజధాని అనుకుంటే, ప్రతి నగరంలో ఓ రాజధాని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. విశాఖలో జరిగిన 'బ్యూటిఫుల్' చిత్ర ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడుతూ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
Amaravathi
Capital
RGV
Beautiful
Tollywood
Vizag
  • Loading...

More Telugu News