YV Subba Reddy: సంక్రాంతి తర్వాత తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం: వైవీ సుబ్బారెడ్డి

  • ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులపై నిషేధం
  • ప్రత్యామ్నాయంగా మంచినీటి కేంద్రాలు  
  • కొండపై నీటికొరత లేదని వెల్లడి

పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని అత్యంత పరిశుభ్ర ప్రదేశంగా తీర్చిదిద్దుతామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. సంక్రాంతి తర్వాత తిరుమలలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ సీసాల వినియోగానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తిరుమల వ్యాప్తంగా మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమలలో నీటికొరత ఇబ్బంది లేదని, మరో రెండేళ్లకు సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

YV Subba Reddy
TTD
Tirumala
Plastic
Ban
Andhra Pradesh
YSRCP
  • Loading...

More Telugu News