RSS: ఆర్ఎస్ఎస్ సభకు, ఎంఐఎం సభలకు ఎలా అనుమతిచ్చారు?: టీ-కాంగ్రెస్ నేతలు

  • టీ- కాంగ్రెస్ ర్యాలీ, సభకు పోలీస్ అనుమతి నిరాకరణ
  • పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతల అభ్యంతరం 
  • రాష్ట్రంలో కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అమలవుతోంది

రేపు తలపెట్టిన టీ- కాంగ్రెస్ ర్యాలీ, సభకు పోలీసుల అనుమతి లభించకపోవడంపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ సభ గురించి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడిన మోహన్ భగవత్ సభకు ఎలా అనుమతిచ్చారు? తిరంగా యాత్ర చేస్తామంటే తమకు ఎందుకు అనుమతివ్వరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అమలవుతోందని ఘాటు విమర్శలు చేశారు. రేపు ఉదయం పదకొండు గంటలకు గాంధీభవన్ కు తమ నేతలు, నాయకులు, కార్యకర్తలు అందరూ చేరుకోవాలని పిలుపునిచ్చారు.

RSS
MIM
T-congress
Uttam Kumar Reddy
VH
  • Loading...

More Telugu News