CAA: కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి లేదు: సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్

  • పౌరసత్వ సవరణ చట్టంపై టీ-కాంగ్రెస్ నిరసన
  • ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతి లేదు
  • సోషల్ మీడియా వేదికగా వచ్చే వదంతులు నమ్మొద్దు: డీసీపీ

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంను నిరసిస్తూ టీ-కాంగ్రెస్ పార్టీ రేపు హైదరాబాద్ లో తలపెట్టిన ర్యాలీ, సభ నిర్వహణకు అనుమతి నిరాకరించినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్, ఇందిరాపార్క్, అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీలు, సభలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతి లేదని అన్నారు. సోషల్ మీడియా వేదికగా వచ్చే వదంతులు నమ్మొద్దని, తప్పుడు ప్రచారం చేసినా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

CAA
T-congress
Rally
Central zone
DCP
  • Loading...

More Telugu News