Amaravathi: నాడు రాజధాని విషయంలో ఎవరూ మాట్లాడొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

  • రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే
  • సీమను రెండో క్యాపిటల్ చేయాలన్న డిమాండ్ నెరవేరట్లేదు
  • రాయలసీమకు రాజధాని హంగులు కావాల్సిందే 

నాడు, నేడు కూడా రాజధాని అంశంలో అన్యాయం జరిగింది రాయలసీమకే అని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినప్పుడు ఎవరూ మాట్లాడవద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇక్కడే నిర్వహించాలని, మినీ సెక్రటేరియట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాయలసీమను రెండో రాజధానిగా చేయాలని పదిహేనేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు. రాయలసీమకు రాజధాని హంగులు కావాల్సిందేనని మరోమారు స్పష్టం చేశారు.

Amaravathi
Rayalaseema
BJP
mp
Venkatesh
  • Loading...

More Telugu News