Kargil: ఐదు నెలల తర్వాత కార్గిల్ లో పున:ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు

  • ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంటర్నెట్ పై నిషేధం
  • సాధారణ స్థితికి వచ్చిన శాంతిభద్రతలు
  • ఇంటర్నెట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన ప్రజలు

కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో, ఐదు నెలల తర్వాత కార్గిల్ వాసులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు అప్పట్లో ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేశారు.

ఆ తర్వాత జమ్ముకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోవడం జరిగింది. లడఖ్ లో కార్గిల్ ఉన్న విషయం తెలిసిందే. శాంతిభద్రతలు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో, ఇంటర్నెట్ ను పునరుద్ధరించాలని గత కొంత కాలంగా కార్గిల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్నెట్ సేవలను పున:ప్రారంభించారు. మరోవైపు, ఇంటర్నెట్ ను జాగ్రత్తగా వాడాలని ప్రజలకు స్థానిక నేతలు సూచించారు.

  • Loading...

More Telugu News