amaravati: వాస్తవాలు బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కుతున్నారు: ఎమ్మెల్యే గోరంట్ల

  • కమ్మ సామాజిక వర్గంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు
  • అమరావతిని దెబ్బతీస్తున్నారు
  • ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
  • జగన్‌ నియంత ధోరణిలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు

వాస్తవాలు బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కుతున్నారని ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. సేవ్ అమరావతి పేరుతో రాజమండ్రిలో అఖిలపక్షం సమావేశం జరిగింది. ఇందులో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, జనసేన, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... కమ్మ సామాజిక వర్గంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అమరావతిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ. 29 వేల కోట్ల అప్పు చేసిందని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నియంత ధోరణిలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

amaravati
Krishna District
Telugudesam
  • Loading...

More Telugu News