Sudigali Sudheer: సుడిగాలి సుధీర్లో హీరో లక్షణాలు పుష్కలంగా వున్నాయి: ఆటో రామ్ ప్రసాద్

  • మేం ముగ్గురం మంచి స్నేహితులం 
  • తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాం
  • సుధీర్ కంటూ ఒక స్టైల్ వుందన్న రామ్ ప్రసాద్

'జబర్దస్త్' వేదిక ద్వారా రచయితగా .. నటుడిగా ఆటో రామ్ ప్రసాద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'సుడిగాలి సుధీర్ .. నేను .. గెటప్ శ్రీను మంచి స్నేహితులం. 'జబర్దస్త్' కామెడీ షో కోసం మేమంతా చాలా కష్టాలు పడ్డాం. మొదట్లో ముగ్గురం కలిసి బైక్ పై స్టూడియోకి వెళ్లేవాళ్లం. ఆ తరువాత టాక్సీ మాట్లాడుకుని వెళ్లేవాళ్లం.

అలాంటి మేము అంచలంచెలుగా ఈ రోజున ఈ స్థాయికి చేరుకున్నాము. సుధీర్ కి హీరో కావాలనే ఆలోచన మొదటి నుంచి వుంది. ఆ దిశగా తనని తాను మలచుకుంటూ వెళ్లాడు. సుధీర్ కి తనకంటూ ఒక బాడీ లాంగ్వేజ్ .. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ వున్నాయి. హీరో కావడమనేది అంత ఆషామాషీ విషయమేం కాదు .. అందుకు తగిన లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉండటం వల్లనే సుధీర్ హీరో అయ్యాడు" అని చెప్పుకొచ్చాడు.

Sudigali Sudheer
Ram Prasad
  • Loading...

More Telugu News