Chandrababu: చంద్రబాబుకు పరిపాలన విధానమే తెలియదు: అవంతి శ్రీనివాస్

  • వైయస్ తరహాలో జగన్ సుపరిపాలన అందిస్తున్నారు
  • ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నారు
  • రైతులనే కాకుండా అందరినీ సంతృప్తిపరచాల్సి ఉంది

టీడీపీ అధినేత చంద్రబాబుకు పరిపాలన విధానమే తెలియదని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్ సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను కూడా అభివృద్ధిపరచాలనే ఆకాంక్షతోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని చెప్పారు. రాజధానికి భూములను ఇచ్చిన రైతులనే కాకుండా ఇక్కడున్న అందరినీ సంతృప్తిపరచాల్సి ఉందని అన్నారు.

కేబినెట్ మీటింగ్ కు వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఓ మీడియా వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

Chandrababu
Jagan
Avanthi Srinivas
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News