Khajakisthan: కజకిస్థాన్ లో టేకాఫ్ అవుతూ భవనాన్ని ఢీకొన్న బెక్ ఎయిర్ విమానం!

  • 100 మందితో బయలుదేరిన విమానం
  • కజకిస్థాన్ లోని ఆల్ మటీ నుంచి టేకాఫ్ అయిన క్షణాల్లోనే ప్రమాదం
  • సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు

కజకిస్థాన్ లోని నూర్ సుల్తానా సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బెక్ ఎయిర్ కు చెందిన విమానం ఆల్ మటీ నగరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోగా, ఆపై క్షణాల్లోనే కూలిపోయింది. విమానంలో 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని వారిలో కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడినట్టు తెలుస్తుండగా, ప్రస్తుతానికి ఏడుగురు మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. టేకాఫ్ తరువాత రెండంతస్తుల భవనాన్ని విమానం ఢీకొందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Khajakisthan
Flight
Bek Air
Takeoff
Accident
  • Loading...

More Telugu News