Sarileru Neekevaru: మహేశ్ బాబు, విజయశాంతిల సీరియస్ స్టిల్... నెట్టింట వైరల్!

  • 13 ఏళ్ల తరువాత వెండితెరపై విజయశాంతి
  • సంక్రాంతికి విడుదల కానున్న 'సరిలేరు నీకెవ్వరు'
  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిత్రం

సుమారు 13 సంవత్సరాల విరామం తరువాత ప్రముఖ నటి విజయశాంతి, మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' కోసం ముఖానికి రంగేసుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే సంవత్సరం సంక్రాంతికి చిత్రం విడుదల కానుండగా, విజయశాంతి ఓ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తారని, ఆమెకు సాయం చేసే పాత్రలో మహేశ్ కనిపిస్తారని టీజర్ తో స్పష్టమైంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఒకే బెంచ్ చివర విజయశాంతి సీరియస్ గా కూర్చుని ఉండగా, అంతే సీరియస్ తో మహేశ్ మరో చివర కూర్చుని ఉన్నారు. ఇది నెట్టింట వైరల్ అయింది. ఇక సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న బంధమేంటన్నది మాత్రం ఇప్పటికి సస్పెన్స్.

Sarileru Neekevaru
Vijayasanti
Mahesh Babu
  • Loading...

More Telugu News