Telugu: బ్రిటీష్ హయాంలోనే న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పిన చరిత్ర ఉంది: జస్టిస్ ఎన్వీ రమణ

  • రేపటి నుంచి 4వ ప్రపంచ తెలుగు మహా సభలు
  • ఆతిథ్యం ఇస్తున్న విజయవాడ
  • సందేశం వెలువరించిన జస్టిస్ ఎన్వీ రమణ

తెలుగు భాష ప్రాశస్త్యం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల్లో తెలుగుభాష అమలు కోసం సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్రిటీష్ పాలన సందర్భంగా న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు చెప్పినట్టు చరిత్రలో నమోదైందని తెలిపారు. తెలుగు భాష నిత్య వికాసానికి విరామం లేకుండా శ్రమించాలని పేర్కొన్నారు. విజయవాడలో రేపటి నుంచి 4వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్వీ రమణ తన సందేశాన్ని వెలువరించారు.

  • Loading...

More Telugu News