Bank Holidays list revealed by RBI: 2020 బ్యాంక్ సెలవులివే...!

  • 2020లో బ్యాంకులకు 20 రోజుల సెలవులు
  • సెలవుల జాబితాను వెల్లడించిన ఆర్బీఐ
  • వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం సెలవులే  

2020 సంవత్సరానికి గాను బ్యాంకు సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకుల సెలవుల వివరాలను వెల్లడించింది. ఏడాది మొత్తానికి బ్యాంకులకు మొత్తం ఇరవై సెలవులున్నాయి. వీటితో పాటు ఆదివారాలు, ప్రతీ రెండో శనివారం, నాలుగో శనివారం కూడా బ్యాంకులకు సెలవులే.  వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 15 - సంక్రాంతి,
ఫిబ్రవరి 21 - మహాశివరాత్రి
మార్చి 9 - హోలీ
మార్చి 25 - ఉగాది
ఏప్రిల్ 1 - యాన్యువల్ క్లోజింగ్
ఏప్రిల్ 2 - శ్రీరామనవమి
ఏప్రిల్ 10 - గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 14 - అంబేద్కర్ జయంతి
మే 1 - మే డే
మే 25 - రంజాన్
ఆగస్ట్ 1 - బక్రీద్
ఆగస్ట్ 11 - శ్రీకృష్ణ జన్మాష్టమి
ఆగస్ట్ 15 - స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 22 - వినాయక చవితి
అక్టోబర్ 2 - గాంధీ జయంతి
అక్టోబర్ 24 - దసరా
అక్టోబర్ 30 - మిలాద్ ఉన్ నబీ
నవంబర్ 14 - దీపావళి
నవంబర్ 30 - గురునానక్ జయంతి
డిసెంబర్ 25 - క్రిస్మస్

  • Error fetching data: Network response was not ok

More Telugu News