Vizag: విశాఖ వాసులు జాగ్రత్త! భూములు కొల్లగొట్టేందుకు దండుపాళ్యం బ్యాచ్ వస్తోంది: కూన రవికుమార్

  • విశాఖకు పులివెందుల పంచాయతీ వస్తోంది జాగ్రత్త
  • తీర ప్రాంతం జగన్ కబంధహస్తాల్లో వెళ్లిపోతోంది
  • ‘దండుపాళ్యం బ్యాచ్ గో బ్యాక్’ అని ప్రజలు నిరసన తెలపాలి

విశాఖపట్టణం నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న సుదూరమైన తీర ప్రాంతాన్ని జగన్, ఆయన కుటుంబసభ్యులు, అనుయాయుల హస్తాల్లోకి వెళ్లిపోతోందని, ప్రజలందరూ మేల్కొనాలని విజ్ఞప్తి చేస్తున్నానని టీడీపీ నేత కూన రవి కుమార్ అన్నారు. ఈ రాష్ట్రానికి జగన్ గ్రహణం పోవాలని, ఇక్కడి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన వారంతా రోడ్డెక్కి నినదించాలని కోరారు.

‘విశాఖపట్టణం జిల్లా వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. దండుపాళ్యం బ్యాచ్ వస్తోంది.. పులివెందుల పంచాయతీ వస్తోంది.. మన ఆస్తులను, భూములను కొల్లగొట్టడం కోసం వాళ్లందరూ వస్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28న విశాఖ పర్యటనకు జగన్ వస్తున్నారని, ‘దండుపాళ్యం బ్యాచ్ గో బ్యాక్’, ‘పులివెందుల పంచాయతీ గో బ్యాక్’, ‘జగన్ మోహన్ రెడ్డి గో బ్యాక్’ అని నినందించాలని పిలుపు నిచ్చారు.

Vizag
cm
Jagan
Telugudesam
Kuna
Ravi
  • Loading...

More Telugu News